Sunday, July 26, 2009

క్విబెక్ జాతీయ దిన సంబరాలు -2

పరెడ్లో భాగంగా వచ్చిన గుర్రబ్బండి. ఈ గుర్రాలు చలి ప్రాంతాలలో ప్రయాణానికి అనువుగా ఉంటాయి.

DSCN3390

DSCN3392

మాంట్రియాల్ కెనిడియన్స్ అనేది మా ఊరి ఐస్ హాకీ టీము. వారి ప్రదర్శన ఇది.

DSCN3394

పరేడ్లో వచ్చిన వింటేజ్ కార్లు.

DSCN3395

DSCN3396

DSCN3401

DSCN3409

DSCN3413

DSCN3418

ఇలాంటి సైకిలు గురించి పుస్తకాల్లో చదివానేగానీ నిజంగా చూడటం మాత్రం ఇప్పుడే.

DSCN3427

DSCN3428

DSCN3433

ISKCON వాళ్ళు కూడా పరేడ్లో పాల్గొన్నారండోయ్!!

DSCN3464

DSCN3466

DSCN3477

పరేడ్ చివరగా ఒక పెద్ద పార్కు చేరుకున్నది. ఇక్కడ ఇక పాటల కచేరికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక అర్థరాత్రి వరకు పాటలు పాడి జనాన్ని అలరిస్తారు. మేము మాత్రం అక్కడే ఉన్న స్టాల్లను తిరిగి చూసి, కాసేపు కార్యక్రమాలు చూసి చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాము.

మాకు మాత్రం మరో శెలవు రోజు సరదాగా గడిచిపోయింది.

Sunday, July 12, 2009

క్విబెక్ జాతీయ దిన సంబరాలు

క్విబెక్ జాతీయ దిన సంబరాల్లో పాలు పంచుకునే అవకాశం ముచ్చటగా మూడోసారి వచ్చింది. మొదటి సారి చిన్న పల్లెలో జరిగిన సంబరాల్లో పాల్గొంటే, కిందటి సంవత్సరం ఓ పట్టణంలో పాల్గొన్నాము. (పాత టపాలల్లో వాటి ఫోటోలు, వీడియోలు చూడవచ్చు). ఈ సంవత్సరం మాంట్రియాల్ నగరంలో జరిగే పెరేడ్ చూసే అవకాశం దొరికింది. వాటి ఫోటోలు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి.

DSCN3262

పరెడ్ ప్రారంభ దృశ్యం.

DSCN3268

DSCN3271

DSCN3279

సంప్రదాయ వస్త్రధారణ.

DSCN3282

DSCN3287  ప్రసిద్ధ వ్యక్తుల పెద్ద బుట్ట బొమ్మలు. మనవైపు ఇలాంటి బొమ్మలు కనుమరుగవుతుంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త బొమ్మలను తయారు చేస్తున్నారు.

DSCN3290

సంగీతం లేని సంబరాలను ఇక్కడ ఊహించనుకూడాలేము. ఆధునిక సంగీతాన్ని ఆహ్వానిస్తూనే సంప్రదాయక సంగీతాన్ని కూడా ఆస్వాదించటం చూడ ముచ్చటగా ఉంటుంది.

DSCN3291

సంగీతమేకాదు శౌర్యమూ మా స్వంతమే.

DSCN3307

DSCN3314

DSCN3325

పరెడ్లో పాల్గొంటున్న వివిధ సంస్థల కళాకారులు, క్రీడాకారులు...

DSCN3311

DSCN3338

DSCN3346 క్విబెక్లో స్థిరపడ్డ చైనీయులు తమ వంతుగా చేసిన ప్రదర్శన.

DSCN3357

DSCN3361

వీటి గురించి కొత్తగా చెప్పాలా?

DSCN3365

ఇక నృత్యకారుల వంతు.

DSCN3367

DSCN3375

DSCN3385

చీర్ లీడర్స్ ల ప్రదర్శన.

మిగిలిన ఫోటోలు తర్వాతి టపాలో. ఫోటోలు ఎలా ఉన్నాయో చెప్పటం మరవకండి.

Sunday, June 21, 2009

సెంటు మాలక్ష్మి

పేరు చూసి ఇదేదో అత్తర్ల గురించి టపా అనుకునేరు. కాదండి, ఇది హండ్రెడ్ పర్సెంటు కెనెడియన్ డాలరులో వందో వంతైన సెంటు గురించే. కెనడా వచ్చిన కొత్తలో ఇత్తడి నాణెంలా ఉండే సెంటు పరిచయమైయ్యింది. ఇక్కడ అందరూ ’సరైన చిల్లర’ ఇచ్చి పుచ్చుకునేవారవటం చేత ఈ నాణెం వాడుకలో ఉంది. ఇది కేవలం సరైన చిల్లర ఇవ్వటానికే తప్ప మామూలు నాణెల్లా వాడలేమన్న సంగతి తెలుసుకునేసరికి నా చొక్కా, పాంట్ల జేబుల నిండుగా నిండిపోయింది. వీటిని నాణెల్లా కేవలం మనుషులు మాత్రమే గుర్తిస్తారు కానీ వెండింగ్ మెషిన్లు వీటి మింగేయటమో, ఉమ్మేయటమో చేస్తాయి. ఇది తెలుసుకునేసరికి కొన్ని నాణేలు చేజారిపోయాయి. పోనీ బస్సులో వాడుదామని బస్సెక్కి గుప్పిల్లతో నాణేలు మెషిన్లో పోస్తుంటే డ్రైవరు ముందు విస్తుపోయి తర్వాత చిద్విలాసంగా నవ్వి, ’నీ నాణేలు మా బస్సు కంపెనీకి డొనేట్ చేసావు పో’ అని చావు కబురు చల్లగా చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. అలా చిల్లర ఏ గుడి మెట్ల దగ్గర పోసినా బోలెడంత పుణ్యం దక్కేది. ఇక్కడ పుణ్యమూ పోయె, పురుషార్థమూ పోయెనని వగచుచూ.... (బాబోయ్.. జరిగిన నష్టాన్ని తలుచుకుంటే గ్రాంథికం వచ్చేస్తోంది). ఇలా వేర్వేరు దారుల్లో బోలెడన్ని నాణేలు నష్టపోయాక, ఇంకేం చేయాలో తోచక సెంట్లను కూడబెట్టడం ప్రారంభించాను. ఇలా కూడబెట్టిన నాణేలతో ఒక పెద్ద సంచి నిండాక..... వంట బాగా కుదిరిన రోజున మా ఆవిడలు ఓ వంద వరహాలు (అదేనండి సెంట్లు) బహుమతి ఇవ్వటం, తనకు షాపింగ్లో నసగకుండ సహాయం చేసినప్పుడు తను నాకు ఓ యాభై వరహాలు (ఎంతైనా మా ఆవిడ పతిసేవకు (పతిసేవ అంటే... పతికి చేసిన సేవకాదు, పతి చేసిన సేవ... కాలం మారింది బాబులు) సరిగ్గా విలువ కట్టగలదు) బహుమతిగా ఇచ్చిపుచ్చుకునే అలవాటు చేసుకున్నాము. అందువల్ల ఇప్పుడు ఇద్దరిదగ్గర చెరో పెద్ద సంచెడు వరహాలు పోగుబడ్డాయి.

మొన్న ముసురు పట్టి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది. సీరియస్సుగా ఇంగ్లీషు సీరియల్ చూస్తున్న మా ఆవిడని చూస్తూ, ’ఇలా ముసురు పట్టి ఉన్నప్పుడు బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదా? నీవిప్పుడు బజ్జీలు వేసి పెడితే నీకు కాసుల పేరు చేయిస్తానే’ అని అన్నాను. మూతి ముప్ఫై వంకరలు తిప్పి ’పెళ్ళైన ఇన్నేళ్ళలో ఒక్క నగా చేయించ లేదుగానీ ఇప్పుడు బజ్జీల కోసం కాసులపేరు చేయిస్తారా?... అయినా కాసులెక్కడ ఉన్నాయో కాసులపేరు కోసం’ అంది ఎకసెక్కంగా. ’మనక్కాసుల కరువేంటి? ఇదిగో సంచుల కొద్ది ఉంటేనూ...’ అంటూ సెంట్ల సంచికేసి చూపించాను. ఆ సాయంత్రం ప్లేట్లో వేడి బజ్జీలతో పాటు అంతకంటే వేడిగా నెత్తి మీద మొట్టికాయలు తినాల్సి వచ్చింది. హాస్య ప్రియత్వం అనేది అందరికీ ఉండదు కదండీ ?!

(ఇది కేవలం తమాషాకు వ్రాసింది. మా ఆవిడ చాలా మంచిది. కేవలం బజ్జీలు మాత్రమే పెడుతుంది.)

Saturday, June 20, 2009

ఓ సాయంకాలపు ఫోటోలు

మా ఊళ్ళో వేసవి సాయంకాలాలు భలేగా ఉంటాయి. రాత్రి 9 దాటినా వెలుగు ఉండటం పైగా ఉష్ణోగ్రత కూడా అనుకూలంగా ఉండటం వల్ల సాయంత్రాలు బయటే గడపటానికి ఇష్టపడతాము. అదే చలికాలం అయితే సాయంత్రం 4 గంటలకే చీకటి పడి మోకాలి ఎత్తున మంచులో కాళ్ళీడుస్తూ నడవలేక ఇంట్లోనే సమయాన్ని గడపాల్సి వస్తుంది. సరే, అప్పటి సంగతి ఎందుకుగానీ, ఈ ఫోటోలు చూడండి.

DSCN3245

ఇది రాత్రి 8 గంటలప్పుడు మా వీధి.

DSCN3247

రాత్రి 8 దాటినా ఇంకా అస్తమించని సూర్యుడు.

DSCN3250

రాత్రి 9 గంటల సమయం.

Sunday, April 26, 2009

Space Race పుస్తక పరిచయం

Space Race పుస్తకాన్ని మీకు పరిచయం చేయటం కోసమే ఈ టపా. అంతరిక్షయాణాన్ని, తద్వారా చంద్రుణ్ణి తాకాలని కలలు కనే ఇద్దరు రాకెట్ ఇంజనియర్ల జీవిత చిత్రణే ఈ పుస్తకం.

ఒకరు జర్మన్ ఇంజనియరైన వెర్నెర్ వాన్ బ్రౌన్. ఈయన రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లరు కోసం రాకెట్లను తయారుచేసేవాడు. గొప్ప గొప్ప రాకెట్లను తయారు చేసి తద్వారా అంతరిక్షాణ్ణి, తర్వాత చంద్రుణ్ణి, తదనంతరం సుదూర గ్రహాలకు ప్రయాణించాలనేది ఈయన కల. ఆ కలను సాకారం చేసుకోవాలంటే తగిన వనరుల కోసం హిట్లరు నాజీ సైన్యానికి సహాయపడక తప్పదు. రాకెట్ల ద్వారా బాంబులను లండనుపై కురిపించవచ్చనే ఉద్దేశంతోనే హిట్లరు రాకెట్ల అభివృద్ధిపై మక్కువ చూపిస్తాడు. కానీ యుద్ధంలో పరిస్థితి తలక్రిందులై హిట్లరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాన్ బ్రౌన్ అమెరికా వెళ్ళి తన కలను నిజం చేసుకుంటాడు.

యుద్ధ పరిస్థితులను, concentration campల్లోని ఖైదీలను బానిసలుగా వాడుకుంటూ రాకెట్లని తయారుచేసే భూగర్భ కర్మాగారాలను, వాటిలో ఖైదీల నిస్సహాయ పరిస్థితులను, గంపగుత్తగా వారిని నిర్మూలించే అధికారుల హేయ కృత్యాలను కూడ రచయిత్రి ఈ పుస్తకంలో చిత్రీకరిస్తారు. అప్పటి ప్రపంచ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరిస్తారు. జర్మనీ రాకెట్ విఙ్ఞానంలో తమకన్నా దశాబ్దాలు ముందుందన్న విషయం తెలిసి యుద్ధానంతరం జర్మని ఇంజనియర్లను తమ దేశానికి ఆహ్వానించి, వారితో తమ పనికాగానే వారిని నిర్లక్ష్యం చేసిన రష్యా, తమని నమ్మి తమ దేశానికి వచ్చిన జర్మన్ ఇంజనియర్లకు తగిన అవకాశాలను కల్పించకుండా సంవత్సరాలు అలక్ష్యం చేసిన అమెరికా వైఖరులను, వాటి వెనుకనున్న రాజకీయ కారణాలను రచయిత్రి వివరిస్తారు. తద్వారా ఈ పుస్తకం కేవలం ఒక చరిత్ర గ్రంథంలా కాకుండా ఒక నవలలా చదివిస్తుంది.

చంద్రుణ్ణి చేరుకోవటానికి బ్రౌనుకు సమ ఉజ్జీగా, అంతరిక్షానికి మనిషిని పంపేవరకు పందెంలో ముందున్న రష్యా రాకెట్ ఇంజనీయరుగా సెర్గి పావ్లొవిచ్ కొరొలెవ్ మనకు పరిచయం అవుతాడు. ఒకపక్క బ్రౌన్ ప్రపంచమంతటికీ కనిపిస్తూ, అందరికీ తెలిసిన వ్యక్తిగా మసులుతుంటే, కొరొలెవ్ పేరు మాత్రం ఎక్కడా బయటకు రాకుండా అప్పటి రష్యా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. బ్రౌన్ లాగానే రాకెట్లను కేవలం తమ సైనిక అవసరాలకు వాడుకోజూసే ప్రభుత్వాలకు సేవ చేస్తూనే తన కలను నిజం చేసుకునేందుకు కొరొలెవ్ చేసిన పోరాటం అచ్చెరువు కలిగిస్తుంది. ఈయన తన జీవిత తొలిదశలో దేశద్రోహిగా నేరం ఆరోపించబడి సంవత్సరాలపాటు ఖైదీగా బంధించబడి, కఠిన శారీరిక శ్రమ చేయవలసి వస్తుంది. జైలునుండి కేవలం రాకెట్లను నిర్మించటానికి బయటకు తీసుకురాబడతాడు. అప్పటికే కుటుంబం చిన్నాభిన్నం అయిపోయుంటుంది. అయినా తన కృషిని కొనసాగిస్తాడు. మానవ జీవనానికి ఏ మాత్రం సహకారి కాని ఎడారి ప్రాంతంలో రాకెట్లను నిర్మిస్తూ రేసులో రష్యాకు తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి పెడతాడు. కొరొలెవ్ జీవితం చాలా స్ఫూర్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా యురి గగారిన్ ను అంతరిక్షంలో మొదటి మనిషిగా పంపే ఘట్టం మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తుంది.

మీకు ఆసక్తి ఉంటే తప్పక చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకంలోని కొన్ని పుటలను ఇక్కడ చూడవచ్చు.

Sunday, April 5, 2009

ఎన్నికలొచ్చాయి

ఎన్నికల జాతర మళ్ళీ మొదలయ్యింది. పగటి వేషగాళ్ళు, గారడీగాళ్ళు, మాటల పోటుగాళ్ళు జాతరను రక్తి కట్టిస్తున్నారు. హామీలు, వాగ్దానాలతో ఓటరు దేవుణ్ణి స్తుతించి మద్యం, డబ్బులతో అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి తగిన నాయకుణ్ణి ఎన్నుకోవటమనే ప్రక్రియ జోరందుకుంటున్నది. ఈ టపాలో కేవలం నా అభిప్రాయాలను మాత్రం పంచుకుంటున్నాను.

నాయకుడనే వాడు తన జాతికి దిశా నిర్దేశం చేస్తూ, శతాబ్దాల పాటు దేశానికి మంచి జరిగేలా ప్రణాళికలను రచించి అమలుపర్చేవాడై ఉండాలనేది నా అభిప్రాయం. ఇప్పటి రాజకీయులలో అలాంటి నాయకులు ఉన్నారనే నమ్మకం నాకు లేదు. యువతరం నాయకులు కూడా దొందు దొందేననిపిస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టడంలో పెద్దవారికన్నా రెండాకులు ఎక్కువే చదివారు. వీరందరి తీరు చూస్తుంటే కేవలం ఈ ఎన్నికలు గట్టేక్కితే చాలాన్నట్లున్నది. ఎంతసేపూ అది ఉచితం, ఇది ఉచితం , ఊరకే డబ్బులిస్తామనేవారేగానీ దేశాన్నిగానీ, రాష్ట్రాన్నిగానీ ఎలా అభివృద్ధి పథంలో నడిపిస్తారో ఎవరూ చెప్పటం లేదు. వీరు ఉచితంగా ఇచ్చే వరాల మీద ఆధారపడి లేని నా ఓటును వారికే ఎందుకివ్వాలో ఏ నాయకుడూ చెప్పటం లేదు. సామాజిక న్యాయం, పేద ప్రజలను ఉద్దరిస్తామనే వాదనకు నా వద్ద విలువ లేదు. ఎవరికివారు తమ స్థితి మెరుగుకావటానికి కష్టపడి ప్రయత్నించాలి. దానికి సమాజంలో అందరికీ సమాన అవకాశం ఉండేలా పరిపాలన ఉండాలి. అంతేగానీ అన్నీ పళ్ళెంలో పెట్టి అందిస్తామని పార్టీలు చెప్పటం తగదు. పోనీ ఆ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారో, అందుకు వనరులు ఎక్కడ ఉన్నాయో ఎవరూ చూపటం లేదు, చెప్పటం లేదు. ఇలాంటి నాయకమన్యులే తప్ప నిజమైన నాయకులెవరూ ఇప్పటివరకూ రంగంలో రాకపోవటం చాలా నిరాశ కలిగిస్తున్నది.

బరిలో ఉన్న అభ్యర్థులందరినీ నిరాకరించే వీలున్నప్పుడే ఓటు వేయాలనే అభిప్రాయాన్ని మార్చుకుని ఈ సారి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నాను. అందుకు కారణం ఇక్కడ ప్రజాతంత్రం ఎలా పనిచేస్తుందో, అందులో ప్రజల పాత్రేమిటో చూసాను. భారతదేశంలో ఉన్నది అచ్చమైన ప్రజాస్వామ్యనే భ్రమ తొలిగిపోయింది. ప్రజాస్వామ్యమనేది ఒక పరిణితి చెందిన సమాజం అనుసరించే పరిపాలనా విధానం. అలా పరిణితి సంతరించుకోని దేశాలు ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వపు పోకడలతోనో, రాచరికపు హంగులతోనో, మంద బలంతోనో అనుసరిస్తాయి. మన దేశంలో నడుస్తున్నది అలాంటి పరిపాలన వ్యవస్థే. ఇందులో ప్రజల పాత్ర కేవలం ఓటు వేయటం వరకే పరిమితం. తర్వాత పరిపాలనా వ్యవహారాలలో ప్రజలది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. కనీసం ఆ పరిమిత పాత్రనైనా పోషించటానికి ఈ సారి ఓటు వేద్దామని నిర్ణయించుకున్నా.

ఇక నా ఓటు ఎవరికి అన్న విషయంలో 35% ఆ పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికలు పాత్ర వహిస్తే, 50% అభ్యర్థి గత చరిత్ర, ఇంతకు ముందు అతని పనితనం ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ అభ్యర్థి కొత్తవాడైయుంటే అతను తన నియోజకవర్గానికి ఎలాంటి సేవ చేయబోతున్నాడో, దానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తాడన్న విషయంపై ఆధార పడుతుంది. ఇక మిగిలిన 15% అతని వ్యకిగత జీవితం, అతని విద్యార్హతలు, అతని మాట, పని తీరుపై ఆధార పడతాయి. ఇంకా ఏమైనా విషయాలు మర్చిపోయుంటే గుర్తు చేయండి. అలా నా ఓటు తీసుకునే అభ్యర్థి కనీసం పాసు మార్కులు (35%) పొందినవాడై ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ శెలవు తీసుకుంటున్నాను.

Sunday, March 8, 2009

స్టార్ ఆఫీసులో తెలుగు

మైక్రొసాఫ్ట్ ఆఫీసుకు బదులుగా స్టార్ ఆఫీసు లేదా ఒపన్ ఆఫీసు వాడేవారికి వాటిల్లో తెలుగులో వ్రాయటానికి ఇబ్బందైతే చిన్న చిట్కా ద్వారా దాన్ని అధిగమించవచ్చు. నేను స్టార్ ఆఫీసును వాడుతున్నాను. (గూగుల్ ప్యాకుతో చాలా రోజుల క్రితం download చేసుకున్నాను. ఇప్పుడు గూగుల్ ప్యాకుతో దొరకటం లేదు. పైగా ఫ్రీ కూడా కాదు. ఒపన్ ఆఫీసు ఇప్పటికీ ఫ్రీగా download ఇక్కడి నుండి చేసుకోవచ్చు.)

సరే చిట్కా ఏమిటంటే,

1. ముందుగా ఏదైనా unicode తెలుగు fontను ఎన్నుకోవాలి. విండోసులో గౌతమి (Gautami) అనేది తెలుగు చూపించడానికి వాడే font. పోతన, వేమన లాంటి fonts కూడా బాగా పనిచేస్తాయి.

2. తర్వాత Insert -> Special Character నుండి తెలుగును subset ద్వారా ఎన్నుకోవాలి.

3. BarahaIME ద్వారా శుభ్రంగా తెలుగును టైప్ చేసుకోవచ్చు.

4. పాయింటు 2 తో వేరే వేరే భాషలను ఎన్నుకుని తర్వాత బరహతో సదరు భాషలో టైప్ చేసుకోవచ్చు. మీరే చూడండి.

star office telugu

Star office Writerలో వివిధ బాషలు.

ఇతర స్టార్ ఆఫీసు అప్లికేషన్లలో కూడా తెలుగు వాడవచ్చు. ఉదాహరణకు Microsoft excelకు సమానమైన Star office calcలో తెలుగు వాడకం.

star calc telugu

పైరెటెడ్ ఆఫీసుతో తంటాలు పడకుండా దాదాపు సంవత్సరంపైనే స్టార్ ఆఫీసు వాడుతున్నాను. మీరు ప్రయత్నించండి.

Saturday, February 28, 2009

శీతాకాలపు జాతర - 3

జాతరలో అడుగుపెట్టగానే మనకు దర్శనమిచ్చేవి మంచుతో నిర్మించిన కళాఖండాలు.

DSCN3079

DSCN3082

DSCN3089

DSCN3094

DSCN3120

DSCN3124

DSCN3125

DSCN3136

DSCN3129

DSCN3139

DSCN3137

ఇలాంటి మంచు శిల్పాలకు కొదువే లేదు. ఇవే కాకుండా పిల్లలు ఆడుకోవటానికి అనేక రకమైన ఆటల శిబిరాలు ఏర్పాటు చేసారు. వీటిలో వీడియో గేములు ఆడే శిబిరం చాలా రద్దీగా ఉండటం భవిష్యత్తులో ఇలాంటి జాతరలు కనుమరుగయ్యే ప్రమాదానికి సూచిక. ఇంట్లో ఒంటరిగా ఇవే ఆటలు ఆడే పిల్లలు బయట నలుగురిలో వచ్చినప్పుడు కూడా అవే ఆటలు ఆడటానికి మక్కువ చూపటం, దానికి పెద్దవాళ్ళు అవకాశం కల్పించటం నిరాశ కలిగించింది. ఇక ఆరుబయటి ప్రదేశాలలో ఆడే మంచు ఆటలకు ఇక్కడ లోటేమీ లేదు. చిన్న పిల్లల జారుడు బండను ఒక కోటలాగ కట్టారు.

DSCN3118

DSCN3108

కుక్కలు లాగే స్లెడ్జి బండి. మంచు మీద వెళ్ళటానికి అనువైన వాహనం.

DSCN3116

మంచు మీద వెళ్ళే జీపులాంటి వాహనం. ఇవేకాకుండా మంచు మీద వెళ్ళే మొబైకులు కూడా ఉన్నాయి. ఈ బైకుల మీద జాతరలో చక్కర్లు కొట్టవచ్చు కూడా.

DSCN3150

మంచు మీద రాఫ్టింగ్ ఆట. మేము కూడా ఆడాము. ఇవే కాకుండా ఇంకా కొన్ని మంచు రైడ్లు కూడా ఉన్నాయి. వాతావరణం -8 డిగ్రీలతో, ఈదరు గాలులకు ముఖమంతా ఎర్రగా అయిపోతున్నా, మంచు మీద జారి పడుతున్నా పట్టించుకోకుండా సంబరాల్లో పాలు పంచుకుంటున్న జనాలను చూస్తే ఇక్కడ శీతాకాలాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది.

DSCN3154

మంచు మీద వెళ్ళే గుర్రబ్బండి. ఈ బండి మీద కూడా షికార్లు చేయవచ్చు.

సాయంత్రం చీకటి పడుతుండగా తిరిగి మా ఊరికి బయలుదేరాము. ఇంతకీ మా టూరు ఎలా ఉందంటారు?