Tuesday, March 11, 2014

VLC media playerలో తెలుగు సబ్ టైటల్స్

మనం online నుండి download చేసిన సినిమాలను చూడటానికి ఎక్కువగా media players వాడుతుంటాము. ఇంగ్లీష్ సిన్మాలను చూసేటప్పుడు సిన్మాలో ఉన్న డైలాగులను కింద ఇంగ్లీష్ భాషలోనే subtitlesగా చూసే వీలు ఉంటుంది. TVలో వచ్చే అన్ని ఇంగ్లీష్ సినిమా చానళ్ళు తమ సినిమాలను ఇలాగే ప్రసారం చేస్తుంటాయి. ఆ subtitlesను మన భారతీయ భాషల్లో చూసే వీలు లేదు. Internetలో హింది భాష subtitles వస్తున్నా తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు లేవనే చెప్పాలి. కానీ కొంచెం కష్టపడితే అది సాధ్యమే. నేను ఇంగ్లీషులో ఉన్న subtitlesను భారతీయ భాషల్లో తర్జుమా చేయటానికి Google translate వాడుకుంటున్నాను కాబట్టి తర్జుమా నాణ్యతపై హామీ ఇవ్వలేను. తర్జుమా సరిగ్గా జరగలేదనిపిస్తే మనం స్వంతంగా చేసుకోక తప్పదు. ఈ పని చేయటానికి Baraha 8.0 వాడాను.

మనం ఏదైనా సినిమాను download చేసుకున్నాక దాని subtitles కావాలంటే ఒక .srt file కూడా download చేసుకుంటాము. తర్వాత సినిమాను VLC media playerలో చూసేటప్పుడు subtitles ON చేసుకుంటే మనకు ఇలా కనిపిస్తుంది.

image

ఇప్పుడు ఆ .srt fileను notepadలో open చేసి దాన్ని .txt fileగా save చేయండి.

ఇక browserలో Google translate open చేయాలి. http://tanslate.google.co.in

అక్కడ translate a document అనే option క్లిక్ చేయాలి.

image

అక్కడ choose file అనే button నొక్కి మీ file select చేయాలి. translate fromని English అని Toని హిందిగా drop down menu నుండి select చేసుకుని Translate button నొక్కండి.

image image

ఇంగ్లీష్ భాషలో ఉన్న డైలాగులు హింది భాషలో మారుతాయి. ఇప్పుడు మొత్తం text select చేసి Baraha Conversion utilityలో UNICODE fieldలో paste చేయాలి. దాన్ని BRHCODEలోనూ తర్వాత ANSI codeలోనూ మార్చుకోవాలి. ఎందుకంటే VLC media player UNICODEను support చేయదు. ఇప్పుడు ఈ ANSI codeను textpadలో paste చేసి save చేయాలి.

image

image

ఇలా save చేసిన fileతో ఒక ఇబ్బంది ఉంది. అదేమిటంటే time duration మధ్యలో ఉన్న --> గుర్తును baraha conversion utility –> మార్చేస్తుంది. దాన్ని మళ్ళీ --> మార్చాలి. దాని కోసం notepadలోని Edit –> Replace utilityని వాడుకోవాలి.

కొత్త fileను .srt fileలాగ save చేసుకోవాలి. “file name.srt” file పేరును .srt extensionతో కలిపి (“”)ల మధ్యలో వ్రాసి save చేయాలి. లేకపోతే అది text fileలాగ save అవుతుంది.

ఇక VLC media playerలో Edit –> Preferences click చేసి, కింద చూపిన విధంగా font select చేసి OK button నొక్కాలి.

image

ఇప్పుడు movie play చేస్తూ subtitle trackగా మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న subtitle file సెలెక్టు చేసుకోవాలి. ఇప్పుడు subtitle హిందిలో కనిపిస్తాయి.

image

image

హింది translationను Google translate దాదాపుగా సరిగ్గా చేయగలుగుతుంది. కానీ, తెలుగులో తర్జుమా చేస్తే ఫలితం ఇలా ఉంటుంది.

image

మనకు ఇది నచ్చకపోతే మనమే స్వంతంగా తర్జుమా చేసుకోవాలి. అప్పుడు మనకు కావలసిన విధంగా subtitles వ్రాసుకోవచ్చు.

image 

Technorati Tags: ,

VLC player UNICODEను ఎలా support చేస్తుందో, దాన్ని మనం ఎలా చేయాలో తెలిసినవారు చెప్పగలరు. అలాగే పై విధానం కన్నా మంచి విధానం తెలిస్తే దాన్ని పంచుకోగలరు. మీ అభిప్రాయలను తెలపండి. Google, Baraha softwareకు ధన్యవాదాలు.

Saturday, February 8, 2014

శ్రీ కుక్కె సుబ్రహ్మణ్య యాత్ర

కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలో చాలా ప్రసిద్ధి. ఇక్కడకు దేశం నలు మూలలనుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు జరుగుతాయి. పిల్లలు లేని వారు ఇక్కడకు వచ్చి పూజలు జరిపిస్తుంటారు. మేము ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఇక్కడ జరుపుకున్నాము.

కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్రం బెంగళూరు నుండి దాదాపు 300 కి.మి. దూరంలో పశ్చిమ కనుమల్లో ఉంది. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. దట్టమైన అడువుల మధ్యలో ఉన్న ఈ చిన్న క్షేత్రానికి బస్సు మరియు రైలు ద్వారా చేరుకోవచ్చు. చాలా మంది బస్సు లేదా సొంత వాహనాల్లో ఇక్కడకు వస్తుంటారు. మొదట ధర్మస్థల వెళ్ళి అక్కడ నుండి కుక్కె వచ్చి త్వరగా బెంగళూరు చేరుతుంటారు. కానీ చాలా మందికి తెలియనిదేమిటంటే కుక్కెకు వచ్చే రైలు మార్గం కనులపండుగగా ఉంటుందని. వీలైతే రైలు ప్రయాణాన్ని వదులుకోవద్దు.

మేము యశవంతపుర నుండి సోమవారం ఉదయం 7:30 బయలుదేరే రైలుకు బయలుదేరాము. వారానికి కేవలం 3 సార్లు మాత్రమే ఈ రైలు ఉంది. మధ్యాహ్నానికి రైలు తుమకూరు మీదుగా హాసన చేరుకుంది. రైలులోనే మధ్యాహ్న భోజనం ముగించాము. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే సకలేశపుర దాటాక ఇంకేం దొరకవు. సకలేశపుర దాటాక జనాలు బోగి వాకిళ్ళ దగ్గర కూర్చోవటం మొదలు పెట్టారు. ఎందుకంటే రైలు ఇక అక్కడి నుండి పశ్చిమ కనుమల్లో ప్రవేశిస్తుంది.

సకలేశపుర తర్వాత వచ్చే దోణిగాల్ స్టేషన్ నుండి యడకుమారి స్టేషన్ వరకు దారి అద్భుతంగా ఉంటుంది. రైలుకు మూడు ఇంజన్లు తగిలిస్త్రారు. రైలు నెమ్మదిగా కనుమల పైభాగానికి చేరుకుంటుంది. ఆ దారిలో వందకు పైగా వంతెనలు, యాభైకు పైగా tunnels ఉన్నాయి. రైలు పర్వత శిఖరాలను చుట్టబెడుతూ వెళ్తుంటే చూడటానికి చాలా బాగుంటుంది. పక్కనే శిఖరాలనుండి జాలువారే పల్చటి జలపాతాలు, లోయల్లో ఉన్న మడుగులు, సెలయేళ్ళు, వందల అడుగుల ఎత్తున్న చెట్లు, వీటన్నిటినీ దాటి మేఘాలను చుంబించే శిఖరాలు చూసి ఆనందించాలి. చాలా మంది దోణిగాల్ నుండి యడకుమారి దాకా రైలు పట్టాల వెంబడి నడుస్తూ (trekking) వెళ్తుంటారని జనాలు చెప్పారు. వర్షాకాలంలో చాలా బాగుంటుందని చెప్పారు. కొన్ని ఫోటోలు మొబైలులో తీసాను. చూడండి. 2013-12-30 14.14.19  2013-12-30 14.24.35 2013-12-30 14.33.47

ఇదే యడకుమారి స్టేషన్.

2013-12-30 14.34.00

రైలు యడకుమారి దాటాక కనుమలు దిగటం ప్రారంభిస్తుంది. ఇక కుక్కె చేరాక బయట ఆటోల,  జీపుల వాళ్ళు వెంటపడతారు. ఇక్కడ చాలా దుబారి. కాస్త నడిస్తే ధర్మస్థల రోడ్డు చేరుకోవచ్చు. అక్కడి నుండి కుక్కెకు బస్సులు దొరుకుతాయి. మేము కుక్కె చేరుకునేసరికి సాయంత్రం 6:00 అయింది. మధ్యలో కుమారధార నది స్నాన ఘట్టం, పెద్ద వినాయకుని గుడి దర్శించుకున్నాము. మొదటిసారి ఇక్కడకు వస్తుండటం వల్ల బెంగళూరు నుండే హొటల్ బుక్ చేసుకున్నాము. కానీ ఇక్కడ దేవస్థానం వారి సత్రాలు బాగున్నాయి. పెద్దగా రద్ది కూడా లేదు. మరుసటి రోజు పూజ మరియు హోమానికి టికెట్లు కొని, భోజనం చేసుకుని పడుకున్నాము. ఇక్కడ కొంచెం పెద్ద హోటల్లు కేవలం రెండే ఉన్నా భోజనాలు బాగానే ఉన్నాయి. ధరలు కూడా అందుబాట్లో ఉన్నాయి.

ఇక్కడి ఆలయాల్లో మగవారిని పై దుస్తులతో వెళ్ళనీయరు. షర్ట్లు, బనియన్లు కూడా తొలగించాలి. కావాలంటే ఒక పైగుడ్డ వేసుకోవచ్చు. అందువల్ల ఒక తెల్ల పంచె, పై గుడ్డలతో మరుసటి రోజు దేవాలయానికి బయలుదేరాము. ఆశ్లేష బలి పూజ హోమము ఆ తర్వాత అభిషేక పూజలతో మధ్యాహ్నం అయింది. భక్తులతో ఉదయం చాలా రద్దీగా ఉంది. పూజల తర్వాత ఆ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నరసింహ స్వామిని, నాగ ప్రతిష్ట మండపాన్ని, ఇన్నితర చిన్న చిన్న ఆలయాలను చూసుకుని అక్కడి నుండి ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము.

DSCN0012  DSCN0010

దేవాలయ వీధి. ఈ వీధి కాక బస్టాండు వీధి. ఉరంతా కలిపితే ఉన్నవి ఈ రెండు వీధులే.

దర్శనాలు అయ్యాక మధ్యాహ్నానికి దేవాలయంలోనే భోజన వసతి ఉంది. భోజనం బాగుంది. భోజనం తర్వాత మధ్యాహ్నానికి విశ్రాంతి తీసుకున్నాము.

సాయంత్రానికి మళ్ళీ దైవ దర్శానానికి వెళ్ళాము. సాయంత్రం ఏ మాత్రం రద్ది లేదు. తీరుబడిగా దర్శనం ముగించి ఇక ఫోటోలు తీసే పనిలో పడ్డాను. చూడండి.

DSCN0049

DSCN0044

స్వామివారి తేరులు. అ వెనుక ఉన్నది భోజనశాల మరియు సత్రాలు.

DSCN0023

గుడి నుండి దగ్గరలో ఉన్న సెలయేటి స్నాన ఘట్టం. ఇక్కడ మఠంలో నివసించేవారు, భక్తులు (పొర్లు దండాలు మొక్కున్నవరు) కూడా స్నానం చేయవచ్చు.

DSCN0039

నది వెనుకున్న సెలయేరు.

DSCN0032DSCN0034

DSCN0035

మఠం

DSCN0026

DSCN0069

ఆదిసుబ్రహ్మణ్యస్వామి గుడి.

DSCN0064

దారిలో ఉన్న ఒక ఇల్లు.

సంధ్య సమయం. ఇది 2013 సంవత్సరపు చివరి సాయంత్రం.

DSCN0072

DSCN0076 DSCN0074

ఇక రాత్రి 10:30కు వోల్వో బస్సు వసతి ఉండటంతో దానికి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 బెంగళూరు చేరుకున్నాము.

Technorati Tags: ,,

Thursday, January 30, 2014

లాల్ బాగ్ పుష్ప ప్రదర్శన

బెంగళూరులోని లాల్ బాగ్ ప్రతి సంవత్సరం స్వాతంత్ర్యదినం మరియు రిపబ్లిక్ దినాలలో ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం కూడా రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదర్శన ఏర్పాటయ్యింది. పూలను వివిధ పళ్ళు కూరగాయలలాగ అలంకరించారు. మీకోసం కొన్ని ఫోటోలు ఇక్కడ.

DSCN0093

పుష్ప ప్రదర్శన ఏర్పాటయిన గ్లాస్ హౌస్

DSCN0100

DSCN0101

DSCN0211  DSCN0110 DSCN0144 DSCN0168 DSCN0170 DSCN0188 DSCN0192

Technorati Tags: ,,

ఇంకొన్ని ఫోటోలు పై ఆల్బంలో చూడొచ్చు.