Sunday, March 8, 2009

స్టార్ ఆఫీసులో తెలుగు

మైక్రొసాఫ్ట్ ఆఫీసుకు బదులుగా స్టార్ ఆఫీసు లేదా ఒపన్ ఆఫీసు వాడేవారికి వాటిల్లో తెలుగులో వ్రాయటానికి ఇబ్బందైతే చిన్న చిట్కా ద్వారా దాన్ని అధిగమించవచ్చు. నేను స్టార్ ఆఫీసును వాడుతున్నాను. (గూగుల్ ప్యాకుతో చాలా రోజుల క్రితం download చేసుకున్నాను. ఇప్పుడు గూగుల్ ప్యాకుతో దొరకటం లేదు. పైగా ఫ్రీ కూడా కాదు. ఒపన్ ఆఫీసు ఇప్పటికీ ఫ్రీగా download ఇక్కడి నుండి చేసుకోవచ్చు.)

సరే చిట్కా ఏమిటంటే,

1. ముందుగా ఏదైనా unicode తెలుగు fontను ఎన్నుకోవాలి. విండోసులో గౌతమి (Gautami) అనేది తెలుగు చూపించడానికి వాడే font. పోతన, వేమన లాంటి fonts కూడా బాగా పనిచేస్తాయి.

2. తర్వాత Insert -> Special Character నుండి తెలుగును subset ద్వారా ఎన్నుకోవాలి.

3. BarahaIME ద్వారా శుభ్రంగా తెలుగును టైప్ చేసుకోవచ్చు.

4. పాయింటు 2 తో వేరే వేరే భాషలను ఎన్నుకుని తర్వాత బరహతో సదరు భాషలో టైప్ చేసుకోవచ్చు. మీరే చూడండి.

star office telugu

Star office Writerలో వివిధ బాషలు.

ఇతర స్టార్ ఆఫీసు అప్లికేషన్లలో కూడా తెలుగు వాడవచ్చు. ఉదాహరణకు Microsoft excelకు సమానమైన Star office calcలో తెలుగు వాడకం.

star calc telugu

పైరెటెడ్ ఆఫీసుతో తంటాలు పడకుండా దాదాపు సంవత్సరంపైనే స్టార్ ఆఫీసు వాడుతున్నాను. మీరు ప్రయత్నించండి.

2 comments:

  1. నేను విండోస్ లో అయితే బరహాలో టైప్ చేసి ఓపెన్ ఆఫీస్ లో పేస్ట్ చేసేవాడిని. ఉబుంటు, ఓపెన్ సోలారిస్, సుసిలో అయితే ఫైర్ ఫాక్స్ ఇండిక్ ఎక్స్టెన్షన్ ప్లగిన్ ద్వారా టైప్ చేసి ఓపెన్ ఆఫీస్ లో పేస్ట్ చేస్తుంటాను.

    ReplyDelete
  2. @ ISP Administrator గారికి,
    మీ సలహాకు ధన్యవాదాలు.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.