Sunday, November 4, 2007

నా పరిచయం

ముందుగా నా పరిచయం,

నా పేరు రాజశేఖర్. నేను వృత్తిరిత్యా మెకానికల్ ఇంజనీరుని. నా ప్రస్తుత నివాసం కెనడాలోని మాంట్రియాల్. అలాగని ఎన్.ఆర్.ఐ కాను. అందరిలానే ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చాను. ఆన్సైట్ అన్నమాట. ఇండియాలో నా ఉద్యోగం బెంగళూరులో. ఇది టూకీగా నా పరిచయం.

ఇప్పుడు ఈ బ్లాగెందుకయ్యా అంటే, నా గురించి నేను చేప్పుకోవటానికి, నా ఆలోచనలను అందరితో పంచుకోవటానికినూ. అందరిలాగానే నాకు కూడా బోలెడన్ని ఆశలూ, వాటి గురించి ఆలోచనలూ ఉన్నాయి. అంతేకాక అప్పుడప్పుడు సమాజం గురించి కూడా ఆలోచిస్తానన్న మాట. వాటన్నిటినీ ఇక్కడ అక్షర రూపం ఇవ్వటమే ఈ బ్లాగు ఉద్దేశం. సో, ఇక నా మనుసులో వచ్చిన వింత వింత ఆలోచనలు, ఊహలూ, అనుభూతులు చదవడనికి సిద్ధంగా ఉండండి.

సాధారణంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఇష్టమైన టాపిక్ బాస్ మరియు ఆఫిస్. కెనడా ఆఫిస్ చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడి పని వాతావరణం చాలా బాగా నచ్చింది. పని మధ్యలో ఎవరూ వచ్చి దిస్టర్బ్ చేయరు. ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. బహుశా ఇదే కావచ్చు నన్ను ఇక్కడ ఇంత కాలం ఉంచింది. ముఖ్యంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ నేర్చుకోవాలి. మధ్యాహ్నం కాఫి తాగుతూ బయట కిటకీలోనుండి రంగులు మారుతున్న చెట్లనూ, మంచుకు సిద్ధమవుతున్న అడవిని చూడటం నాకెంతో ఇష్టం. ఇంత ప్రశాంతంగా ఉంటుందని బెంగళూరులో ఎవరైనా అంటే నమ్మే వాడిని కాను. ముందుగా నేను మీతో ఇక్కడ గమనించిన మంచి విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను.

మళ్ళీ కలిసినపుడు మరిన్ని విషయాలు.

3 comments:

  1. మాంట్రేల్ లే...
    నాకు మాంట్రేల్ అంటే చాలా భ్రమ.
    హాకీ పుట్టిన చోటు కదా ఎంతైనా.
    ఇక ఫ్రెంచి, మంచు వగైరా వగైరా
    టొరోంటో వెళ్లాను గానీ మాంట్రేల్ వెళ్లలేదు. ఎప్పటికైనా వెళ్లాలి.

    ReplyDelete
  2. bagundhi raaj nee alochanalu .. naku telugu anna telugu basha anna..telugu vyakti anna...banduvula oka raka mayina sambandham anipistundi..na comments kuda telugulo rasta...

    ReplyDelete
  3. నచ్చింది మీ ఆలోచన

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.