ఈ శనివారం మేము క్వీబెక్ నగరంలో జరిగే శీతాకలపు జాతరలో పాల్గొనటానికి మరియు ఐస్ హోటల్ సందర్శించటానికి వెళ్ళాము.
ఐస్ హోటళ్ళను కేవలం మంచుతో నిర్మిస్తారు. హోటల్లో అన్నీ మంచు ఖండాలతోనే తయారు చేస్తారు. శీతాకాలంలో బాగా చలి వాతావరణం ఉండే దేశాలలో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీంలతో ఇలాంటి హోటళ్ళను సందర్శకుల కోసం నిర్మిస్తుంటారు. క్వీబెక్ ఐస్ హోటల్లో బస చేయటం చాలా ఖరీదైన వ్యవహారం. ఒక్క రాత్రి బసకు ఒక్కరు 300 డాలర్లు సమర్పించుకోవాలట. ఆ ఐస్ హోటల్ ఫోటోలను ఇక్కడ ఉంచుతున్నాను.
ఈ ఐస్ హోటల్లో మొత్తం 40 గదులు ఉన్నాయి. కొన్ని సూట్లలో గోడలపై ఇలాంటి మంచు కళాఖండాలు చెక్కి ఉంటాయి. మామూలు గదులు కేవలం మంచం, కుర్చీ, మేజులతో సాదాసీదాగా ఉంటాయి.
గదుల్లో మంచాలు కూడా మంచువే. అయితే వాటిపైన పడుకోవటానికి పరుపులు మాత్రం మామూలువి. లేకపోతే ఒక రాత్రి మంచు దిమ్మెలపై పడుకుంటే బిగుసుకుపోవటం ఖాయం.
హోటల్ హాలు దృశ్యం.
హాలు మధ్యలో వేలాడుతున్న దీపపు గుత్తి. ఇది రంగు రంగు కాంతులు విరజిమ్ముతూ నయనానందం కలిగిస్తుంటుంది. కావాలంటే ఈ వీడియో మీరే చూడండి.
మిగిలిన ఫోటోలు తర్వాతి టపాలో. ఇంతకీ ఐస్ హోటల్ ఎలా ఉందంటారు?
vaNikistunnaayi :-)
ReplyDeletenice.
ReplyDeletewow!wonderful!!
ReplyDeletewow
ReplyDeleteWow.. చాలా బాగుంది.
ReplyDeleteమొత్తం ఐస్ తోటే ఎలా నిర్మిస్తారబ్బా.?....
@నరసింహ గారికి, @ పరిమళం గారికి, @ కొత్త పాళీ గారికి, @ ఉమాశంకర్ గారికి, @ Anonymousకు మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
ReplyDelete@ ఉమాశంకర్ గారికి, ఐస్ హోటల్ నిర్మాణం ఎలా చేస్తారో పూర్తిగా తెలియదండి. అన్నీ టపాలు పూర్తయ్యేలోగా తెలుసుకుని మీకు తెలుపగలను.