ఈ హోటల్లో తినడానికేమీ దొరకదు కానీ తాగడానికి మాత్రం అన్నీ దొరుకుతాయి. విశేషమేమిటంటే తాగడానికి ఉపయోగించే గ్లాసులు కూడా మంచుతోనే తయారుకావటం. ఇది ఐస్ హోటల్లోని బారు. మందుబాబుల సందడి ఇక్కడ చాలా ఎక్కువ.
మందు తాగే అలవాటు లేనివారికి శీతల పానీయాలు, జ్యూసులు, కాఫీలు అందించే కౌంటరు.
ఐస్ హోటలుకు ఆధారంగా నిలిచిన స్థంభాలు.
రేయ్... ఎవర్రా?? నా ఫోటో హాలు మధ్యలో పెట్టింది. పిల్లలు దడుచుకుంటారు. తీసేయండి.
ఇది కేవలం బస కోసం ఏర్పాటైన హోటల్ మాత్రమే కాదండోయ్.. ఈ హోటల్లో పెళ్ళి చేసుకోవాలనుకునే వారి కోసం ఒక చాపెల్ కూడా నిర్మించారు. దాని లోపలి దృశ్యం. పెళ్ళి చూడటానికి వచ్చిన ఆహుతులు కూడా మంచు దిమ్మలపై ఆసీనులు కావలసిందే.
సరే, ఐస్ హోటలు చూసి ఇక శీతాకాలపు జాతర (Winter Carnival) చూడటానికి బయలుదేరి క్వీబెక్ నగరం చేరుకున్నాము. ముందుగా క్వీబెక్ నగరపు అబ్జర్వేటరీ టవరు చేరుకున్నాము. క్వీబెక్ నగరాన్ని ఇంతకు ముందే చూసి ఉన్నా శీతాకాలంలో ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలమే మరోసారి ఈ టవరు ఎక్కేలా చేసింది. ఇదే ఆ అబ్జర్వేటరీ టవరు.
ఇక ఆ టవరు పైనుండి క్వీబెక్ నగరాన్ని చూస్తే అబ్బురమనిపించింది. మీరేమంటారు?
క్వీబెక్ అంటే స్థానిక ఇండియన్ల భాషలో ’నది ఇరుకుగా మారిన ప్రదేశం’ అని అర్థమట. ఇక్కడ సెయింట్ లారెన్సు నది ప్రవాహం ఇరుకుగా మారుతుంది. మీకు కనిపిస్తున్నది గడ్డ కట్టిన ఆ నదే. క్వీబెక్ నగరం పూర్వం చాలా ప్రసిద్దిగాంచిన రేవు పట్టణమట. యూరపు నుంచి అమెరికా వచ్చే చాలా సరకు ఓడలు ఇక్కడే వ్యాపార వ్యవహారాలు నిర్వహించేవట.
ఇదే జాతర జరుగుతున్న స్థలం. ఇక్కడి చిత్రాలు తర్వాతి టపాలో.
మంచు హోటల్ ఫోటోలు బాగున్నాయండి. మంచి విషయాలు తెలియచేస్తున్నారు.
ReplyDelete@ సిరిసిరిమువ్వగారికి,
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.