చాలా రోజుల తర్వాత ఇప్పటికి టపా వ్రాయటం కుదిరింది. ఇండియా వెళ్ళిపోవటం దాదాపు ఖాయం అయిన తర్వాత కంపెని అవసరాల కోసం మరో 7-8 నెలల పాటు అక్కడే ఉండమని మా మేనేజరు చెప్పటంతోనూ, పాత ఇంటి లీజు ముగిసినందున మళ్ళీ అద్దె ఇల్లు వెతుక్కోవాల్సి వచ్చింది. గత 3 సంవత్సరాలలో మూడో అద్దె ఇంటిని దిగ్విజయంగా వెతుక్కుని చేరేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.
ఇక్కడ కూడా చెట్లు ఆకులు రంగులు మారి చాలా అందంగా కనిపించాయి. తర్వాత మంచు కురవటం కూడా ప్రారంభం అయ్యింది. కొన్ని ఫోటోలు పంచుకుందామని ఈ టపా.
శిశిరానికి స్వాగతం పలుకుతున్న చెట్లు.
వర్ణరంజితంగా ఉన్న మా పాత ఇంటి వీధి.
మా కొత్త ఇంటి కిటికినుండి కనిపిస్తున్న మంచు వర్షం.
ఇక ఈ మంచు కరిగి మళ్ళీ వేసవి ప్రారంభం అయ్యేవరకు నిరీక్షణ తప్పదు.
ఫోటోలు చాలా బాగున్నాయి.
ReplyDeleteసిరిసిరిమువ్వగారికి,
ReplyDeleteఫోటోలు మీకు నచ్చినందుకు సంతోషం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.