Saturday, May 24, 2008

సాయంత్రం 9:00 గంటలు

ఇదేమిటి సాయంత్రం 9 గంటలంటున్నాడు అనుకుంటున్నారా? నిజమేనండి. మా ఊళ్ళో వేసవిలో రోజు నిడివి బాగా పెరుగుతుంది. ఇంకో నెలాగితే సాయంత్రం 10 గంటలు కూడా అవుతుంది మరి. వేసవిలో మాకు ఉదయం 4.30 వెలుతురు రావటం ప్రారంభం అయి రాత్రి 10 దాటితేగాని చీకటి పడదు. అదే చలికాలమైతే ఉదయం 8 దాటితేగాని రాని వెలుగు సాయంత్రం 3.30కే వెళ్ళిపోతుంది. చలికాలంలో ఇంట్లోనే ఉండిపోవల్సి ఉంటుంది. బయట కాలు పెట్టడం ఎంతో అవసరం ఉంటే తప్ప జరగదు. -35 డిగ్రీల చలిలో, జోరుగా గాలి వీస్తుంటే, మోకాళ్ళ లోతు మంచులో నడవటం అనుభవిస్తేగానీ తెలియదు. "ఎముకలు కొరికే చలి", "కొయ్యబారిపోవటం" అంటే ఏమిటో గత 2 సంవత్సరాలలో బాగా అర్థం అయింది. అందుకే వేసవి మాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయాలలో మా ఆఫీసు పనివేళలు. ఉదయం 6.30కు ప్రారంభమై సాయంత్రం 3.30 ముగుస్తుంది. ఎవరూ కూడా ఆయాసపడిపోతూ గంటలకొద్ది పనిచేయరు. ముఖ్యంగా ఎంత freshగా వెళ్తామో, అంతే freshగా తిరిగి వస్తాము. అందువల్ల నేను సాయంత్రం 4 గంటలకే ఇంటికి దిగబడిపోయి, కాస్త ఫలాహారాన్ని లాగించి, మా ఇంటి పక్కనే ఉన్న అడివిలో నడకకో, దగ్గరలో ఉన్న నదీ తీరానికో, వీధుల వెంబడి వ్యాహళికి వెళ్ళటం అలవాటయ్యింది. జీవితాన్ని ఇలా కూడా అహ్లాదంగా గడపవచ్చన్న విషయం ఇక్కడ వచ్చాకే అర్థం అయింది. ఒక్కోసారి ఇండియా వెళ్ళాక మళ్ళీ ఆ ఉరుకుల పరుగుల జీవితంలో ఇమడగలనా అని భయమేస్తుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. అని పాడుకోవటం తప్ప ఏం చేయగలం చెప్పండి?

blog01

సాయంసంధ్యలో రూపు చెదిరిపోతున్న మేఘం.

ఈ ఫోటోను రాత్రి? 9 సూర్యుడి అస్తమయం తర్వాత తీసాను. ఊరికే బ్లాగులో పోస్టు చేస్తున్నాను.

4 comments:

  1. చాలా అదృష్టవంతులు. మీ ఆఫీస్ టైమింగ్స్ చాలా బాగున్నాయి. అవి మనకూ ఇంప్లిమెంట్ చేస్తే కాస్త బద్దకం వదులుతుంది.

    ReplyDelete
  2. నీలాకాశం చిత్రం:సూర్యాస్తమయం తరువాత ఇలాంటి రంగు భారత్ లో రాదు. బాగుంది.

    ReplyDelete
  3. @ నువ్వుశెట్టి బ్రదర్స్,
    మీరన్నది నిజం. ఇలాంటి పనివేళల వల్ల work-life balance చక్కగా కుదురుతుంది.

    @ cbrao,
    మీకు ఫోటో నచ్చినందుకు సంతోషం. ఇకపై మరిన్ని ఫోటోలు టపాలలో ఉంచటానికి ప్రయత్నిస్తాను. మీ వ్యాఖ్యకు నెనెర్లు.

    ReplyDelete
  4. నీలాకాశ సాయంత్రం బావుంది.

    -- విహారి

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.