చూస్తూండగానే వసంతం వచ్చింది. అసలెప్పటికైనా కరుగుతాయా అనిపించేలా ఉన్నా మంచు కొండలను ఆనవాలు లేకుండా చేస్తూ, తెల్లటి మంచు పూలతో విరబూసి ఉన్న చెట్లకు రంగు రంగుల పూలను పూయించేందుకు వసంతం తరలి వచ్చింది. బద్ధకంగా ముడుచుకుని ఉన్న ప్రకృతి గోరు వెచ్చని ఎండకు ఒళ్ళు విరుచుకుని పచ్చని చిగుళ్ళతో వసంతానికి స్వాగతం పలకడానికి సిద్ధం అయింది. నల్లటి చలికోటులను వదిలి రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి పిల్లలు బయట ఆడుకోవటానికి పరుగులు పెడుతున్నారు. స్థబ్దుగా ఉండే వీధులు జనసంచారంతో కళకళలాడుతున్నాయి. మా ఊరిలో నవ చైతన్యం తొణికిసలాడుతోంది. ఆ నవవసంతాగమనాన్ని మీతో ఇలా పంచుకుంటున్నాను.
మంచంతా కరిగిపోగా సువిశాలంగా కనపడుతున్న మా వీధి.
మా ఇంటి ముందున్న అడివి పల్చగా రంగులను అద్దుకుంటోంది. అన్నట్లు అందులో బోలెడన్ని ఆపిల్ చెట్లు ఉన్నాయి. ఈ వేసవికి ఆపిల్ ఊరగాయ పెట్టాలి. ఏమంటారు?
ఆపిల్‍తో అవకాయా!!! ఇదేదో కొత్తగా ఉందే.. తొందరగా పేటెంటుకు అప్లై చెసేయ్యండి. లేదంటే, కాపీ కొట్టే వాళ్ళు చాలా మంది మీకన్నా ముందుగా మార్కెట్ లోకి ఈ ప్రోడక్ట్ తీసుకొస్తారు.
ReplyDeleteఅంతేకాకుండా, మన తెలుగు మహిళలు ఈ విషయం మీద ప్రయోగాలు చెయ్యక ముందే మీరు మేలుకొనడం మంచిది.
కావాలంటే, ఆంద్రప్రదేశ్‍లో నేను మార్కటింగ్ చేసిపెడతాను. మీకెంత కావాలి?? నాకెంత ఇస్తారు??
@చక్రవర్తిగారికి,
ReplyDeleteగత సంవత్సరం పచ్చి ఆపిల్ కాయలను కోసి ఆవకాయ పెట్టాను. అప్పటికి మా ఆవిడ ఇక్కడకు రాలేదులెండి. కాబట్టి ఈ సంవత్సరం శాస్త్రోక్తంగా ఆపిల్ ఆవకాయ పెడదామని ఆలోచన. మాకు పెరు దేశపు మామిడికాయలు కూడా దొరుకుతాయనుకోండి. ఇక marketing విషయమా? దానికి ఇంకా సమయం ఉందిలెండి. ముందు ఇక్కడి market capture చేయాలన్నదే లక్ష్యం.
నిజంగానే... నమ్మ బుద్ది కావడం లేదు. ఏదైనా కొత్తగా ఉంది. ఇప్పుడు మీరు మీ శ్రీమతితో కలిసి ఉన్నారను కుంటాను. వ్యాపారం విషయమేదో తోందరగా మొదలు పెట్టేయ్యండీ. అక్కడి మార్కెట్ మీరు చూసుకోండి, ఇక్కడి మార్కేట్ నేను చూసుకుంటా.
ReplyDeleteపనిలో పనిగా పెరూ దేశ ఆపిల్స్ ఎలా ఉంటాయే ఎమో.. వాటి మీదకూడా ఒక కన్ను వేసి వుంచండి. వాటి ఆవకాయ ఎలా ఉంటుందో చేసి చెప్పండి.
పనిలో పనిగా, మీరుండే ప్రదేశ విషయాలు కూడా వ్రస్తూ ఉండండి.