Sunday, April 13, 2008

Amway నిజానిజాలు

మనకు తెలిసి మన బంధువులో, స్నేహితులో, ఇరుగు పొరుగులో చాలామంది Amway సంస్థ సభ్యులై ఉండవచ్చు. దీంట్లో చేరే చాలామంది తాము ఈ వ్యాపారం ద్వారా కోట్లు, లేదా లక్షలు సంపాదిస్తామని గాఢంగా విశ్వసిస్తుంటారు. కాని ఇదే వ్యాపారంలో సంవత్సరాల తరబడి కష్టపడి, ఉన్నత అంచెలను చేరిన ఒకాయన తన చేదు అనుభవాలను ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. దాన్ని మీకు పరిచయం చేయటమే ఈ టపా ఉద్దేశం.

Merchants of Deception అనే ఈ పుస్తకాన్ని ఆమ్వే పేరిట జరుగుతున్న వ్యాపారాన్ని దాదాపు 10 సంవత్సరాల పాటు నిర్వహించి, అందులో ఉన్నత అంచెలను చేరి, అందులోని మోసాలను పరిశీలించిన Eric Scheibeler అనే ఆయన వ్రాసారు.

Eric ఉద్దేశం ప్రకారం ఈ వ్యాపారంలో నికరంగా సంపాదించేదేమీ ఉండదు. కేవలం ఎండమావులను తరుముతూ, అలసిపోతూ చివరకు ఉన్నదంతా పోగొట్టుకోవటం ఈ వ్యాపారంలో చాలా సాధారణం. కాని ఈ నిజాన్ని తెలుసుకోనీయకుండా చాలా పకడ్బందిగా వీరి శిక్షణ ఉంటుందని ఈ పుస్తకంలో వివరిస్తారు. ఈ వ్యాపారంలో చాలా మంది లక్షలకు లక్షలు సంపాదించినట్లు ప్రచారం చేస్తారు. కాని, నిజంగా ఆ లక్షాధికారుల సంపాదనలో కేవలం Amway వ్యాపారం ద్వారా సంపాదించింది 5 శాతం దాటదని ఎరిక్ చెప్తారు.

ఈ పుస్తకాన్ని ఆయన pdf రూపంలో ఉంచారు. http://www.merchantsofdeception.com/ పుస్తకం చదవదలచినవారు ఇక్కడ మీ email ID ఇస్తే మీకు పుస్తకం download చేసుకోవటానికి ఒక link పంపబడుతుంది.

మనకు తెలిసినవాళ్ళల్లో చాలా మంది ఈ Amway సభ్యులుగా ఉండవచ్చు. మనం వారిని వస్తువులు అంటగట్టే అమ్మకందార్లుగా భావించి ఆట పట్టించటమో, తప్పుకు తిరగటమో చేస్తుంటాము. అలాంటి వారు మీకు తారసపడితే వారికి ఈ పుస్తకం గురించి చెప్పండి. నిజంగానే ఈ వ్యాపారంలో ఉన్నవారందరూ లక్షలు సంపాదిస్తుంటే సంతోషమే. అలాకాక నష్టపోతూ కూడా ఆ నిజాన్ని తెలుసుకోలేక ఇంకా ఇందులో పెట్టుబడి పెడుతుండేవారి కోసమే ఈ పుస్తకం. మనకు తెలిసినవారెవరైనా ఈ సంస్థ సభ్యులుగా ఉంటే, వారికి ఈ పుస్తకం గురించి చెబుదాము. నిజానిజాలను వారే తెలుసుకుంటారు. ఏమంటారు?

4 comments:

  1. ఈ Amway సంస్థపై ఎన్ని వార్తలు కోడై కూస్తున్నా, రాత్రి కి రాత్రి బాగా సంపాదించేయ్యాలనే అత్యాశ మనుషులను అటువైపు లాగేస్తోంది. ఎన్ని సత్య వార్తలు.. ఎన్ని కోర్టు కేసులు .. ఇన్ని జరుగుతున్నా ఈ పిచ్చి జనానికేమో ఎదో సంపాదించేయ్యాలని .. ఎదో పొడిచేయ్యాలన్న తాపత్రయం, అస్సలు నిజాన్ని కమ్మెస్తోంది.

    అన్నింటికీ మించి, కష్ట పడకుండా సంపాదించేయ్యలన్న భద్దకస్తుల సోమరితనాన్ని ఈ వ్యవస్థ బాగా సొమ్ము చేసుకుంటోంది. అటు అమ్మే వ్యక్తులు గానీ .. ఇటు కొనే వ్యక్తులు గానీ.. ఒక్కసారైనా ఆ ఆ వస్తువులు ఎక్కడ తయారవుతున్నాయో అని ఆ ఆ వస్తువులకు ఉన్న కవర్‍ని చూసారా?? వాటిలోని వస్తువులు నూటికి ఎనభై శాతం హైదరాబద్‍లోనే తయారు చేస్తున్నాం అని చెబుతున్నా, ప్రతీ వస్తువును మనం మూడొంతులు ఎక్కువ చోప్పున అమ్ముతున్నాం .. అలాగే కొంటున్నాం.

    వాళ్ళు చెబుతున్న మల్టీ లెవల్ మార్కెటింగ్, ఇటు సాధారణ మనుష్యులే కాక, అంతో ఇంతో టెక్నాలజీ గురించి తెలిసిన వ్యక్తులు కూడా వీరి ప్రలోభాలకు లోనవుతున్న వైనం చూస్తూంటే.. వీరిని పుట్టించిన ఆ దేవుడే కాపాడాలని పిస్తుంది.

    ఏది ఏమయినా, నాకొక అస్త్రాన్ని అందించినందులకు ధన్యవాదములు ..

    Amway ఏజంట్సు లారా .. కాసుకోండి..

    ReplyDelete
  2. amway టైపులో చాల పుట్టుకొచ్చాయి. chain schemes మరి డేంజర్. ఆ మధ్య గుప్త అని ఒ లంజా కొడుకు (naa కొడుకుది hyderabad అనుకొంటా) కోట్లల్లో జనాలని ముంచాడు. ఇంకో లంజా కొడుకు (ఆ లంజా కొడుకుది కూడా హైదరాబాదీ) books ని CD లోకి ఎక్కించే HOME BASED WORK అని (ఈ నా కొడుకు BANK EMPLOYEE). చాల మంది చాల పోగుట్టుకొన్నారు. అలాగే CHARMINAR, KRISHI ... ఈ లంజా కొడుకులందరికి HYDERABAD వాళ్ళు భలే దొరుకుతారు

    ReplyDelete
  3. @చక్రవర్తి,
    మీ అభిప్రాయానికి నెనెర్లు.

    @ కృష్ణారావు,
    మీ కోపం సమంజసమే అయినా మీ అభిప్రాయాన్ని సభ్యతగా ప్రకటించుంటే బాగుండేది. మీరు చెప్పిన Books to CD వ్యవహారం నాకు బాగా తెలుసు. త్వరలోనే దానిపై టపా వ్రాస్తాను. సమయానికి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. నమస్తే, అటువంటి నీచులు, చీడ పురుగుల ఫై అంత కంటే ఎక్కువ తీవ్ర పద జాలాన్ని వాడినా తప్పు లేదు. అటువంటి వారికి కనీస మర్యాద ఇవ్వకూడదు. మనము మర్యాద ఇచ్చామంటీ.. వాళ్లు చేసిన నీరాలు, ఘోరాలను మనము ఆమోదించినట్లే.. అని నా అభిప్రాయం. తప్పు చేసిన వారికి తిట్లు తప్పవు. పైగా వారందరూ ఎంతో చదువు కున్న వారు. పొరపాటున నీరం చేయలేదు.. తెలిసీ కావాలనే, స్వార్థం కోసం .. చేసిన వారే. అటువంటి వారిని physical గా శిక్చించే అవకాశం అందరకి కుదరదు. ఇలా అయినా తిట్టితే వేరే కొంత మందికి అయినా బుద్ది వస్తుందేమో...చూద్దాం.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.