Monday, March 24, 2008

ఉద్యోగ ధర్మం

మొన్న నా మెడికల్ ఇన్సురెన్స్ కార్డ్ చేయించుకుందామని మాంట్రియాల్ వెళ్ళాను. అక్కడ చేరుకునేసరికి మధ్యాహ్నం 2.00 అయింది. సాయంత్రం 4.30కు ఆఫీసు మూసివేసే సమయం. అక్కడ నాలాగ వచ్చినవారితో పెద్ద క్యూ ఏర్పడింది. అంత దూరం వచ్చి వెనుదిరిగి పోవటం ఎందుకని మేమూ ఆ తోక చివర నిల్చున్నాము. లోపల వెళ్ళి మా వంతు వచ్చేసరికి మరో గంట గడిచింది. మేము వెళ్ళి మా పనిని విన్నవించుకున్నాము. అక్కడి ఉద్యోగిని మా పత్రాలను పరిశీలించి తృప్తిపొందిన తర్వాత మాకు ఇన్సురెన్స్ కార్డ్ వస్తుందని కానీ దానికోసం 3 నెలలు ఆగవలసి ఉంటుందని చెప్పి, మేము ప్రస్తుతం మా వైద్యసంబంధ సేవలను ఎలా పొందుతున్నామో తెలుసుకుని, మా కార్డు వచ్చేవరకు ఇక్కడి రాష్ట్రంలో ఏయే సేవలను ఉచితంగా పొందవచ్చో తెలిపింది. మేము ఒక్క ఫారం కూడా నింపలేదు. అమే మా వివరాలను నమోదు చేసుకుని ఫారం ప్రింటు చేసిస్తే సంతకాలు మాత్రం పెట్టాము. ప్రధాన కార్యాలయానికి మా పత్రాలు scan చేసి పంపించేసింది. మా పని పూర్తి కావటానికి పట్టింది కేవలం 20 నిమిషాలే. ఇది ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాల పనితీరు. మరి మన దేశపు ప్రభుత్వ కార్యాలయాల పనితీరును ఇక్కడితో పోల్చగలమా? లంచం ఇవ్వకుండా మా ఆవిడ passport కోసం మా పెళ్ళి ధృవపత్రం సంపాదించటానికి బెంగళూరులో వేరే వేరే మూలల్లో ఉన్న 3 కార్యాలయాలకు దాదాపు నెలన్నర పాటు తిరిగగాను. అఫీసులో 5 రూపాయలకు దొరికే అప్లికేషన్ ఫారం "స్టాకు" లేదు కానీ అదే ఆఫీసు బయట మెట్ల ధగ్గర 35 రూపాయలకు దొరుకుతుంది. 100 రూపాయలిస్తే ఒక బ్రోకరు పని చేసిపెడతాడు. కాదూకూడదంటే అడ్డమైన ఫారాలు నింపి, ఎవెరెవరివో సంతకాలు తీసుకుని రావాలి. ఇంజనియరింగు చదివినా ఒక చిన్న ఫారం కూడా నింపలేవా అన్నట్లు ఆ ఉద్యోగి ఓ పదిసార్లు తప్పులు పడతాడు. ప్రతి తప్పుకూ పరమపద సోపానంలో ఆదిశేషుడు మింగిన కాయలా మనం క్యూ చివరకు చేరుతాము. ఇలా 2 సార్లు జరిగేసరికి సదరు ఉద్యోగి పని చేసిన అలుపు తీర్చుకోవటానికి వెళతాడు. మళ్ళీ ఆఫీసు మూసేముందు కనిపిస్తాడు. ఇలా 3 శనివారాలు జరిగిన తర్వాత, ఫారంలో ఏ చిన్న తప్పులూ లేవని నిర్ధరించుకుని వెళ్తే, చివరకు ఒక ఫారం కాగితం వెనుకవైపు తిప్పి, ఆ ఖాళీ ప్రదేశంలో సంతకం చేయలేదని అప్లికేషన్ తీసుకోకుండా నిరాకరించిన ఉద్యోగిని చూస్తే ఎంత అసహ్యం కలిగిందో మాటల్లో చెప్పలేను. చివరకు ధృవపత్రం చేతికి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయి మా ఆవిడ వెంటలేకుండానే నేను కెనడా వచ్చాను. దీనివల్ల ఎంత డబ్బు, సమయం వృధా అయిందో ఆ ఉద్యోగికి పట్టదు. ఒకవేళ ఫిర్యాదిచ్చినా అది త్వరగా తెమిలే వ్యవహారం కాదు. అయినా ఒక ఉద్యోగి తన విధులను నిర్వర్తించేలా చేయటానికి కూడా ఫిర్యాదు చేయవలసి రావటం మేము చేసుకున్న దురదృష్టం.

మన ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఇలాగే పనులు జరిగే రోజులు వస్తాయా?

4 comments:

  1. మీరు చాలా మంచి పని చేశారు, ఆ ఉద్యోగికి లంచం ఇవ్వకుండా. దానివల్ల మీకు చాలా ఇబ్బంది, ధన నష్టం కలిగి ఉంటుంది కాని, మీకు తృప్తి గా ఉంటుంది లంచం ఇవ్వలేదని. ఇలాంటివి చెప్పడం చాలా తేలిక, ఆచరించడం చాలా కష్టం, మీ పరిషితిలో నేనున్నట్లైతే, మధ్యవర్తి ద్వారా పని చెయించుకునేవాడినేమో :(

    నమస్కారలతో,
    సూర్యుడు :-)

    ReplyDelete
  2. In my case, eventhough I have applied with all documents and arranged two witnesses to sign infront of the officer, (wasting their precious time), the officer warmly requested for 400 rupees towards formalities. Everyone was very cordial.. friendly and helpful after paying the formalities..fees. I got the certificate (very much legal) in a week.

    ReplyDelete
  3. పాస్పోర్ట్ వెతలు ఈ టపాలో చూడండి
    వీసా వచ్చే పాస్ పోర్ట్ పోయె

    -- విహారి

    ReplyDelete
  4. @ సూర్యుడు గారికి,
    తృప్తి మాట దేవుడెుగు కాని ఈ మొత్తం వ్యవహారం వల్ల నేను మా ఆవిడని 6 నెలలపాటు ఇండియాలోనే వదలి వెళ్ళవలసి వచ్చింది. దాంతో పాటు ఆ ఆరు నెలల ఇంటద్దె, ఇంటి ఖర్చులు అదనం. ఈ సారి ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉండి, ఇలాంటి అవినీతి ఉద్యోగులు తగిలితే, మొత్తం వ్యవహారాన్ని cell phoneతో వీడియో తీసి బ్లాగులో పెడతా.

    @Sujata
    I can understand your situation. They will take advantage of our urgency and demand bribe. The situation will be far worse for illiterate people. Civil servants should understand this. I feel more comfortable to get my work done through automatic machines or internet. In canada, I got done my electricity connection, internet, telephone etc through internet or over phone without ever visiting the offices. I am looking for such day in India. We can save lot of money which is otherwise wasted as salaries for these corrupted employess.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.