చివరకు ఎలాగైతేనేమి మా ఊరు గురించి తెవికిలో ఒక వ్యాసం సృష్టించగలిగాను. దీనికి ప్రేరణ ఈనాడులో వచ్చిన ముఖచిత్ర కథనం అయితే సహాయం వైజాసత్యగారిది. ఎలా వ్రాయాలో తెలియక సహాయం కోసం అడిగితే వైజాసత్యగారు సహాయపడ్డారు. అందుకు వారికి నా కృతఙ్ఞతలు.
మనం మన ఊరి గురించి గర్వంగా చెప్పుకోవాలి. మన ఊరు మన వ్యక్తిత్వంలో ముఖ్య భాగం. అందువల్ల మీరు కూడా మీ ఊరి గురించి మీకు తెలిసింది వ్రాయండి. మీకు అన్ని విధాలుగానూ సహాయం తెవికిలో దొరుకుతుంది. కేవలం బద్ధకంవల్ల మాత్రం మానేయకండి. కాస్త సమయం చేసుకుని మీ ఊరిని ప్రపంచానికి పరిచయం చేయండి.
మా ఊరి వ్యాసానికి ఇక్కడ లంకె ఇస్తున్నాను. ఎవరైనా ఈ వ్యాసానికి మార్పులు చేర్పులు చేయదలిస్తే నిరభ్యంతరంగా చేయవచ్చు లేదా నాకు ఇ-మెయిల్ పంపినా సరే.
http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF
సూపరు. నేనుకూడా మా వూరిని చేర్చి మీలాగే సంబరపడ్డాను. :)
ReplyDeleteమరొక్కసారి మీ ఊరి లింకు చూడండి. మరిన్ని వివరాలు చేర్చగలరేమో ప్రయత్నించవచ్చు
ReplyDeleteవిశ్వనాథ్ గారికి, మీరు నా వ్యాసానికి చేసిన మార్పులు చూసాను. బాగున్నాయి. మీ శైలిని అవలంబిస్తాను. మీ సూచన ప్రకారం మరిన్ని వివరాలు పొందుపరచడానికి ప్రయత్నిస్తాను.
ReplyDelete