Sunday, October 5, 2008

అడవి కాచిన ఆపిల్స్

మా ఇంటికి దగ్గర ఉన్న ఒక ఆపిల్ చెట్టు ఫోటో ఇది. ఈ సంవత్సరం ఆపిల్ పికింగ్ కు వెళ్ళటం కుదర్లేదు. ఆందుకని ఇలా సరిపెట్టామన్నమాట.

apple1

తోటల్లో అయితే గుత్తులు గుత్తులుగా ఉంటాయి.

apple2

2 comments:

  1. అబ్బా! ఎంతచక్కటి కాపు,ఎంత పచ్చటి ఆకు(లు)ఇంతకీ ఆపిల్ పికింగ్ అంటే ఏమిటండి?పైగా ఈ సంవత్సరం వెళ్ళలేదన్నారు కాస్త వివరించగలరా?
    ఎందుకంటే నేను భారతదేశములో ఉంటాను,ఈ మధ్య కాలంలో ఈతపళ్ళు,కాయలను కూడా ఇలా గుత్తులుగుత్తులుగా చూడలేదు.

    ReplyDelete
  2. @ రాజేంద్ర కుమార్ గారికి,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఆపిల్ పికింగ్ అంటే మరేమీ లేదండి, సెప్టెంబరు నెలలో మా బాసు తన కుటుంబంతో పాటు మమ్మల్ని కూడా ఆపిల్ తోటలకు తీసుకువెళతారు. రకరకాలైన ఆపిల్స్ సేకరించుకుని వస్తామన్నమాట. కేవలం ఆపిల్స్ మాత్రమే కాకుండా బెర్రీల్లాంటి పళ్ళనూ, వైన్లనూ పట్టుకురావటం ఇక్కడివారి అలవాటు.
    ఈ సారి తోటలకు వెళ్ళటం కుదరలేదు. అందువల్ల దగ్గరలోని ఆపిల్ చెట్టు ఫోటో తీసి సంతోషించాము.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.