గతవారం 3 రోజులు శెలవులు కలసి రావటం వల్లా, ఇక ఈ నెల్లోనే ఇండియా తిరిగి వెళ్ళే అవకాశం (మా మేనేజరు దయ, మా ప్రాప్తం) ఉండటం వల్లనూ ముచ్చటగా మూడోసారి నయాగరా విహార యాత్ర కుదిరింది. అక్కడి కొన్ని ఫోటోలు, వీడియోలు మీతో పంచుకుందామని ఇక్కడ ఉంచుతున్నాను. ఇంతకు మునుపు తీసిన నయాగరా ఫోటోలు నా పాత టపాల్లో ఉన్నాయి, ఆసక్తి ఉన్నవారు పాత పుటలు తిరిగేయగలరు.
ఇది గుర్రపునాడాగా పిలువబడే జలపాతపు పాయ. ఇది కెనడా దేశపు భూభాగంలో ఉన్నది. జలపాతం దగ్గరకు బోటుల్లో వెళ్ళే సదుపాయం వేసవికాలంలో ఉంటుంది.
ఇది అమెరికా దేశపు భూభాగంలో ఉన్న పాయ. అమెరికావాళ్ళు జలపాతానికి పక్కనుండి కిందకు దిగుతూ చూసే వీలున్నది.
బోటులో అమెరికా వైపున్న జలపాతాన్ని ఫోటో తీశాను. సూర్యుడు జలపాతానికి ఎదురుగా ఉన్నప్పుడు జలపాతం నుండి ఎగిసిన నీటి తుంపరలలో అందమైన ఇందధనుస్సు ఏర్పడుతుంది.
జలపాతాన్ని దగ్గరగా చూసి ఆనందిస్తున్న అమెరికా ప్రజలు.
కెనడా దేశం వైపున్న జలపాతం. బోటు జలపాతానికి చాలా దగ్గరగా వెళుతుంది. దాదాపు జలపాతం మనమీదే దుముకుతున్నాదా? అనిపిస్తుంది.
జలపాతపు నీటి తుంపరలు వర్షం పడినట్లు పడతాయి. అందువల్ల అందరికీ ప్లాస్టిక్ raincoats ఇస్తారు. జలపాతాన్ని దగ్గరగా చూసి ఆనందిస్తున్న మా సహ ప్రయాణీకులు.
గుర్రపు నాడా ఆకారంలో ఉన్న అగాధంలో దుముకుతున్న జలధార.
రాత్రి రంగురంగుల విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతున్న నయాగరా. రంగులు మారుస్తుంటారు. చూడటానికి చాలా బాగుంటుంది. కానీ తక్కువ కాంతిలో ఫోటోలు తీయటం నాకు రాదు.
జలపాతానికి దగ్గరలో ఉన్న స్కైలాన్ టవరునుండి నయాగరా జలపాతపు హొయలు.
ఇక నయాగరా జలపాతానికి దగ్గర ఉన్న Marine land ఫోటోలు, వీడియోలు నా మరుసటి టపాలో...
thanks a lot i show the nayagara video to my children they feel happpy
ReplyDeleteకళ్లకు కట్టినట్లుగా చూపారు. నెనర్లు.
ReplyDeleteVery lovely pics. thanks for sharing.
ReplyDeleteఫోటోలు చాలా బాగున్నాయి
ReplyDeleteధన్యవాదాలు
ఇంత అందమైన దృశ్యాలను చూసే భాగ్యం కల్గించినందుకు మీకు ధన్యవాదాలు.
ReplyDelete@ Gupta
ReplyDeleteThanks for your comment. I am happy that your children liked the Niagara. I will post Marineland photos and videos soon.
@cbrao, sujata, శ్రీకాంత్, చిన్ను గార్లకు,
ఫోటోలు నచ్చినందుకు సంతోషం. మీ ప్రోత్సాహపూర్వకమైన వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
WOW!
ReplyDeleteఫోటొలు చాలా బాగా తీసారు. నేను నా నయాగరా ట్రిప్ గురించి రాసాను చూడండి.
ReplyDeletehttp://kalas3.blogspot.com/2008/09/1.html