Sunday, June 22, 2008

మా ఊరి రైతు బజారు

ప్రతి శనివారం మా ఊరి బస్టాండ్ దగ్గర ఉన్న రైతు బజారుకెళ్ళి కూరగాయలు, బ్రెడ్లు, పళ్ళు తెచ్చుకోవటం మా అలవాటు. ఇండియాలోలాగానే ఇక్కడ కూడా బేరాలాడుతూ, తెలిసిన రైతులను పలకరిస్తూ, వారు తెచ్చే కొత్త కొత్త బెర్రీలను రుచి చూస్తూ మార్కెట్ అంతా కలయతిరగటం బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయమేమిటంటే చాలామంది ఆకుకూరలు, కూరగాయల మొక్కలను కొనుక్కుని వాటిని ఇంట్లో పెంచుతారు. వారికి అవసరం వచ్చాక వాటిని వాడుకుంటారు. ఇలాంటి వారి కోసం కూరగాయ మొక్కలు, పూల మొక్కలు కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక maple syrup దొరికితే సంతోషమే సంతోషం.

ఇక ఇక్కడ ఉన్న ఇబ్బందల్లా మాకు ఫ్రెంచ్ బాష రాకపోవటం. అయినా వదలకుండా ఫ్రెంచి పదాలు, అంకెలు నేర్చేసుకుని, వేళ్ళు చూపిస్తూ ధరలను బేరమాడేస్తుంటాము. అంతా కొన్న తర్వాత దగ్గరలోని పార్కులో కాసేపు సేదతీరి ఇంటికి బయలుదేరుతాము.

మార్కెట్ ఇంటికి 2 కి.మి. దూరంలోనే ఉండటంవల్లా, వేసవి కావటంవల్ల నడుచుకుంటూ వెళ్తాము. ఆ దారంతా బెర్రీ మొక్కలు, ఆపిల్ చెట్లతో నిండి ఉంటుంది. ఆ దారిలో సైకిళ్ళు తప్ప మరే వాహనాన్ని అనుమతించరు. కాబట్టి ఆ దారి నిశబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ నడక దారిలో బెర్రీ మొక్కలనుండి బెర్రీలను కొద్దిమంది సేకరిస్తుంటారు. మేము వారితో కలసి కొన్ని బెర్రీలను సేకరించి వాటిని తింటూ ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం దాటిపోతుంది.

ఇదే పని ఇండియాలో అయితే కంగారు కంగారుగా స్కూటరు మీద వెళ్ళి ఒక గంటలో కూరగాయలు కొనేసుకుని, గభాలున ఇంటికొచ్చేసి, టి.వి లకు అతుక్కుపోవటం చేస్తుంటాను. ఈ సారి అక్కడ వచ్చినప్పుడు నా పద్డతులు మార్చుకోవాలి.

DSCN2638

ఇదే మా ఊరి రైతు బజారు.

DSCN2644

కూరగాయల కోసం వచ్చినవారితో సందడిగా ఉన్న మార్కెట్. బారులు తీరిన కారులు, వ్యానులు.

DSCN2631

అమ్మకానికున్న పూల మొక్కలు. సగం సంవత్సరం మంచుతో కప్పబడి ఉండే ఈ దేశంలో తోటపని మీద వీళ్ళకున్న శ్రద్ఢ చూస్తే నాకు అబ్బురమనిపిస్తుంది.

DSCN2633

పళ్ళు తినటం ఇక్కడ అలవాటైన ఒక ఆరోగ్యకర అలవాటు.

DSCN2639

మా ఊరి జండా ఉన్న గోపురం. ఊరికి జండా ఏమిటని ఆశ్చర్యపడకండి. ఇక్కడంతే. మంగళవారం క్వీబెక్ జాతీయ దినం కోసం ఈ గోపురాన్ని, దాని వెనుక ఉన్న మైదానాన్ని ముస్తాబు చేస్తున్నారు. సోమవారం రాత్రి బాణాసంచా, ఆటలు, పాటలు, బీరు... అబ్బో చెప్పలేనంత సందడి. గత సంవత్సరం నాకు బీరు స్నానం కూడా అయింది. ఈ సారి ఎలా ఉంటుందో తర్వాత చెప్తానే.

9 comments:

  1. బావుంది టూర్...
    మొత్తానికి ఆరోగ్యకరంగా జీవిస్తున్నారన్నమాట.

    ReplyDelete
  2. hi RAj.....garu...
    e roje chusa mee blog.pics chala baunnayi...
    inka meeru cheppe kaburlu...kuda chala baunnayi.
    simple ga......
    meeru word verification teeseyagalarani manavi...

    ReplyDelete
  3. @ ప్రవీణ్ గారికి, రమ్యగారికి, రాధికగారికి,
    మీ అభిప్రాయాలకు కృతఙ్ఞతలు.
    @ మీనాక్షిగారికి,
    నా బ్లాగు మీకు నచ్చినందుకు నెనెర్లు. word verification తీసేశాను. గమనించగలరు.

    ReplyDelete
  4. హలో రాజు గారూ బాగున్నారా?
    చాలా రోజుల తరవాత మీ బ్లాగు చూస్తున్నా. రైతుబజారు కొంగోళ్ళు ఆమోదయోగ్యం! మీ రాజధానిలో వారం నిర్బంధం మాత్రం నాకు అమరపు రాని అనుభవం :-)

    ReplyDelete
  5. @ కొత్తపాళీగారికి,
    మళ్ళీ చాలా రోజులకు మీ వ్యాఖ్య కనిపించింది. సంతోషము. కెనడా దేశమే అంతండి. వచ్చిన అతిథులను ఒక్క పట్టాన వెళ్ళనివ్వదు. మర్యాదలన్నీచేసి పంపుతుంది. :)

    ReplyDelete
  6. hello sir ,
    meeru rasina tapa chala bagundi.
    maadu kuda anantapur lo kuderu mandal ,kammuruu Village sir.
    naa E-Mail: Jwalanarasimhareddy@gmail.com

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.